తాజా వార్తలు

Monday, 23 May 2016

టీమ్ కు వార్నింగ్ ఇచ్చిన రాజమౌళి…?

వేసవి సెలవలను ముగించుకుని ‘బాహుబలి’ టీం మళ్లీ పనిలో పడిపోయింది. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ లో ఈ యూనిట్ బిజీగా ఉంది. అయితే ఇందులో పనిచేసే ప్రతిఒక్కరికి జక్కన్న రాజమౌళి వార్నింగ్ ఇచ్చాడట. సినిమా రిలీజ్ అయ్యే వరకు మూవీకి సంబంధించిన ఏ విషయాన్ని బయటపెట్టకండి అంటూ టీమ్ అందరికి రాజమౌళి హెచ్చరించాడట. దీంతో యూనిట్ కూడా ఓకే అన్నట్లు సమాచారం.
‘బాహుబలి- ది బిగినింగ్’ కు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తుండగా, కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆర్కా మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment