తాజా వార్తలు

Tuesday, 10 May 2016

ఎయిర్ హోస్టెస్ టు ఎర్రచందనం స్మగ్లర్…

ఎర్రచందనం అక్రమ రవాణాలో స్మగ్లర్లకు సహకరిస్తున్న మహిళా స్మగ్లర్‌ సంగీత ఛటర్జీ ను అరెస్ట్‌ చేశారు పోలీసులు. కలకత్తాకు చెందిన ఈమె ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసి ఆ తరువాత మోడల్ గా పనిచేసింది. ఆమె వద్ద నుండి ఆరు బ్యాంకు ఖాతాలు, రెండు బ్యాంకు లాకర్‌ తాళాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రెడ్‌శాండిల్‌ స్మగ్లింగ్‌ కేసులో పీడీ చట్టం కింద జైలులో శిక్ష అనుభవిస్తున్న లక్ష్మణన్‌ విచారిస్తే సంగీత విషయం బైటపడింది. దీంతో కలకత్తాలో దాడులు చేసి సంగీతను అరెస్ట్‌ చేశారు పోలీసులు.
ఎయిర్‌హోస్టెస్‌గా పని చేసే సంగీత స్మగ్లర్‌ లక్ష్మణన్‌ను పెళ్లి చేసుకుంది. అతని ఆర్థిక లావాదేవీలన్నీ ఆమె చూస్తోంది. లక్ష్మణన్‌ అరెస్టు తర్వాత ఆమె ఆన్‌లైన్‌లోనే దాదాపు 10 కోట్ల మేర లావాదేవీలను చేసినట్లు తెలుస్తోంది. మయన్మార్‌ రాజధాని యాంగూన్‌ నుంచి వచ్చే హవాలా నగదును వివిధ ప్రాంతాలకు ఆమె చేరవేస్తున్నట్లు విచారణలో తేలింది. అయితే సంగీతను కోల్‌కతా న్యాయస్థానంలో హాజరుపరచి ట్రాన్సిట్‌ వారెంట్‌ ద్వారా చిత్తూరుకు తీసుకురావాలని ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఆమెను న్యాయస్థానానికి తీసుకెళ్లేలోపే పాతిక మంది న్యాయవాదులు రావడంతో పోలీసులే అవాక్కయ్యారు. అక్కడి న్యాయస్థానం ఆమెకు బెయిల్‌ మంజూరు చేయడంతో పోలీసులు వెనుదిరిగారు. విచారణ నిమిత్తం ఆమెను మళ్లీ అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment