తాజా వార్తలు

Saturday, 21 May 2016

తుపాను వస్తే.. విదేశీ పర్యటనా..?

విశ్వనగరమంటున్న గ్రేటర్ హైదరాబాద్ శుక్రవారం వచ్చిన తుపానుతో బీభత్సంగా మారితే పట్టించుకోకుండా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లడం టీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. హన్మకొండలోని చంద్రా గార్డెన్స్‌లో శనివారం జరిగిన మినీ మహానాడులో ఆయన మాట్లాడారు. హుద్‌హుద్ తుపానుతో విశాఖపట్నం అల్లకల్లోలమైతే ఏపీ సీఎం చంద్రబాబు హుటాహుటిన అక్కడకు చేరుకుని 24గంటల్లో విద్యుత్, తాగునీటి సమస్య పరిష్కరించారని, ఆయనను చూసి తెలంగాణ మంత్రులు నేర్చుకోవాలన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీని గెలిపించాడంటూ మునిసిపల్ శాఖను కే టీఆర్‌కు కట్టపెట్టిన సీఎం కేసీఆర్ ప్రస్తుత పరిస్థితికి సమాధానం చెప్పాలని రేవంత్ సూచించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన జరిగిన మినీమహానాడులో రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఎంపీ గరికపాటి మోహన్‌రావు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీతక్క, వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు
« PREV
NEXT »

No comments

Post a Comment