తాజా వార్తలు

Saturday, 7 May 2016

టీడీపీని విమర్శించే హక్కు టీఆర్ఎస్ కు లేదు

టీడీపీని విమర్శించే నైతిక హక్కు టీఆర్‌ఎస్‌కు లేదని, తమ పార్టీ విలువలు, సంప్రదాయాల గురించి మంత్రి కేటీఆర్‌కు ఏమీ తెలియదని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. సంప్రదాయాలను ఉల్లంఘించింది టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లే అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిధులు, నీళ్లు, నియామకాలను గాలికి వదిలేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌లో అనుకోకుండా ఎవరైనా పోయి ఉపఎన్నికలు వస్తే వారి ఏకగ్రీవానికి సహకరిస్తామన్నారు. కాంగ్రెస్‌కు టీడీపీ తోక పార్టీ అనడం సరికాదని, 2004, 2009లో ఎవరు ఎవరికి తోక పార్టీగా ఉన్నారో తెలుసుకోవాలన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment