తాజా వార్తలు

Thursday, 19 May 2016

వణికిస్తున్న రోను తుఫాను…

రోను తుఫాన్ కోస్తాంధ్రను వణికిస్తోంది. తుఫాన్ ప్రభావంతో కోస్తా తీరం కల్లోలంగా ఉంది. నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు వణికిపోతున్నాయి. ఉత్తరాంధ్ర విలవిల్లాడుతోంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లా చిత్తడిగా మారింది.
తుఫాన్ ప్రభావం పంట పొలాలపై స్పష్టంగా కనిపించింది. రోను తుఫాను ఎఫెక్ట్ ఉన్న ప్రతి జిల్లాలో మామిడి, మెక్కజొన్న పంటలకు ఇబ్బందులు తప్పలేదు. విజయవాడ, మచిలీపట్నం, అవనిగడ్డ, గన్నవరం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి. గన్నవరంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావటంతో చేతికి వచ్చిన మెక్కజొన్న నీటిపాలయ్యింది. ఇక తూర్పుగోదావరి జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షం కారణంగా అరటి పంట దెబ్బతింది. ఇక కొన్ని చోట్ల పెంకుటిల్లు కూడా కూలిపోయి, చాలా మంది గాయాలపాలయ్యారు. అయితే అధికారుల హెచ్చరికలతో రోను తుఫాను పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటంతో కొన్ని చోట్ల ప్రాణ నష్టం తప్పింది.
« PREV
NEXT »

No comments

Post a Comment