తాజా వార్తలు

Wednesday, 18 May 2016

చివరగా శర్వానంద్ ఓకే అయ్యాడు…

సతీష్ వేగెష్న దర్శకుడిగా, దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న ‘శతమానం భవతి’ సినిమాకు హీరో ఖరారు అయ్యాడు. విభిన్న కథలతో వరుస సక్సెస్ లు అందుకుంటున్న శర్వానంద్ ను ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. మొదట ఈ సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ ను అనుకున్నారు. కానీ ఏవో కారణాల వల్ల ధరమ్ తేజ్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు.
తరువాత రాజ్ తరుణ్ లైన్ లోకి వచ్చాడు. దాదాపుగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే సమయానికి ఈ సినిమా నుండి రాజ్ తరుణ్ కూడా తప్పుకున్నాడు. దీంతో చివరగా శర్వానంద్ కు దిల్ రాజు స్టోరీ చెప్పినట్లు, శర్వానంద్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో శర్వానంద్ కొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది.
« PREV
NEXT »

No comments

Post a Comment