తాజా వార్తలు

Thursday, 12 May 2016

మొన్న రాజీనామా… ఈ రోజు ప్రమాణ స్వీకారం…

బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐసీసీ చైర్మన్ పదవి కోసం బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేశానని శశాంక్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ పదవిలో ఆయన రెండేళ్ల వరకు కొనసాగుతారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.., “అందరితో కలిసి పనిచేస్తానని, బోర్డ్ గర్వపడేలా చేసి, క్రికెట్ ను మరింత ముందుకు తీసుకెళ్తానని” పేర్కొన్నాడు. ఐసీసీ చైర్మన్ పదవికి జరగనున్న ఎన్నికలకు గానూ ఈ సారి శశాంక్ ఒక్కరి పేరు ప్రతిపాదించడం విశేషం.
« PREV
NEXT »

No comments

Post a Comment