తాజా వార్తలు

Saturday, 28 May 2016

బాలయ్య కు ఓకే చెప్పిన శ్రియ..?

బాలకృష్ణ వందో సినిమాగా తెరకెక్కుతున్న ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. కానీ హీరోయిన్ మాత్రం కన్ఫార్మ్ కాలేదు. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార, అనుష్క, ఇలియానా, కాజల్ ఇలా చాలామంది పేర్లు వినిపించాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో శ్రియ కూడా చేరిపోయింది.
బాలకృష్ణ సరసన శ్రియ అయితే సరిపోతుందని, అందునా రాణి పాత్రలో బాగుందని భావించిన డైరక్టర్ క్రిష్ ఆమెను సంప్రదించి స్టోరీ చెప్పడం, అందుకు శ్రియ ఓకే చెప్పి కాల్షీట్స్ ఇచ్చిందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందేమో చూడాలి. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్లో ‘చెన్నకేశవ రెడ్డి’ వచ్చిన విషయం తెలిసిందే
« PREV
NEXT »

No comments

Post a Comment