తాజా వార్తలు

Friday, 6 May 2016

పిరికివాళ్లం కాదు… పోరాటం ఆగదు…

సేవ్ డెమోక్రసీ ర్యాలీలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సోనియాగాంధీ… అధికారంలోకివచ్చిన రెండేళ్లలోనే బీజేపీ ప్రభుత్వం… దేశాన్ని భ్రష్టుపట్టించిందని మండిపడ్డారు కాంగ్రెస్
అధినేత్రి సోనియా. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న మోడీ సర్కారుకు టైం దగ్గర పడిందన్నారు సోనియా.
ప్రభుత్వం ”తమను కేసులు, అవినీతి ఆరోపణలతో భయపెడితే.. వెనక్కు తగ్గేంత పిరికివాళ్లం కాదు… కేంద్రంపై పోరాటం తమకు కొత్తకాదు… కాంగ్రెస్ ఇలాంటి ఎన్నో సంక్షోభాలను చూసింది”… దేన్ని ఎలా ఎప్పుడు తిప్పికొట్టాలో తమకు తెలుసన్నారు సోనియాగాంధీ.
దేశంలో మోడీ, మోహన్ భగవత్‌లకు వ్యతిరేకంగా మాట్లాడేవారిపై అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. దేశ ప్రజల కోసం మోడీపై పోరాడుతూనే ఉంటామన్నారు.
మరోవైపు కాంగ్రెస్‌కు పోటీగా బీజేపీ కూడా నిరసన కార్యక్రమం చేపట్టింది. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలిపిన బీజేపీ ఎంపీలు… 60 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ… దేశాన్ని భ్రష్టుపట్టించిందని ఆరోపించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment