తాజా వార్తలు

Thursday, 19 May 2016

క్రీడా, సినీ ప్రముఖులకు నిరాశ

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీచేసిన క్రీడాప్రముఖులకు నిరాశ ఎదురైంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున తొలిసారి పోటీ చేసిన టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ ఓటమి చవిచూశాడు. తిరువనంతపురం నుంచి బరిలో దిగిన శ్రీశాంత్ చిత్తుగా ఓడిపోయాడు. ఇక పశ్చిమబెంగాల్ లో సిలిగురి నియోజకవర్గం నుంచి తృణమాల్ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన భారత్ ఫుట్ బాల్ జట్టు మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా వెనుకబడ్డారు.

ఎన్నికల ఫలితాలు పలువురు సినీ ప్రముఖులకు కూడా నిరాశ కలిగిస్తున్నాయి. పశ్చిమబెంగాల్ లో ఉత్తర హౌరా నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన నటి రూపా గంగూలీ వెనుకబడింది. ఇక తమిళనాడులో డీఎండీకే చీఫ్, ముఖ్యమంత్రి అభ్యర్థి కెప్టెన్ విజయ్ కాంత్ మూడో స్థానంతో వెనుకంజలో ఉన్నాడు.
« PREV
NEXT »

No comments

Post a Comment