తాజా వార్తలు

Tuesday, 24 May 2016

వీరత్వం చూపించిన కండల వీరుడు…

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, అనుష్క శర్మ ప్రధాన పాత్రలో నటించిన ‘సుల్తాన్’ ట్రైలర్ రిలీజైంది. ట్విస్ట్ లు ఏమీ లేకుండా ట్రైలర్ లోనే సినిమా స్టోరీని చూపించారు డైరక్టర్. ఇందులో సల్మాన్ ఖాన్, అనుష్క శర్మ రెజ్లర్లగా ఇద్దరు విరుచుపడ్డారు.
అనుష్క శర్మను చూసినప్పుడు సల్మాన్ చెప్పే డైలాగ్ లు, వారిద్దరి మధ్య రొమాన్స్, కొన్ని కారణాల వల్ల ఆటకు దూరమైన సల్మాన్ మళ్లీ ఫామ్ లోకి రావాలని కష్టపడటం, కోచ్ గా రణ్ దీప్ హుడా ట్రైలర్ లో ముఖ్యంగా ఆకట్టుకున్నాయి. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యష్ రాజ్ ఫిలింస్ నిర్మించారు. రంజాన్ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది.

« PREV
NEXT »

No comments

Post a Comment