తాజా వార్తలు

Thursday, 5 May 2016

నీట్ పై విచారణ రేపటికి వాయిదా…

తెలుగు రాష్ట్రాలలో నీట్‌ నిర్వహణపై సుప్రీంకోర్టులో ఈరోజు వాద‌న‌లు కొన‌సాగాయి. రెండు తెలుగు రాష్ట్రాల న్యాయ‌వాదులు పీపీ రావు, బసవప్రభు పాటిల్ సుప్రీంకు త‌మ వాదనలు వినిపించారు. ఈ ఏడాది నీట్ నుంచి తెలుగు రాష్ట్రాలకు మిన‌హాయింపు ఇవ్వాల‌ని కోరారు. నీట్ వల్ల ఆర్టికల్-371డీ కు విఘాతం కలుగుతోందని ఇరు రాష్ట్రాల న్యాయవాదుల కోరారు.
త‌క్కువ స‌మ‌యంలో సీబీఎస్‌ఈ సిల‌బ‌స్ కు ప్రిపేర్ అవడం క‌ష్టమ‌వుతుందని, అలాగే భాషా పరంగా కూడా తెలుగు విద్యార్థుల‌కు నీట్ ప‌రీక్ష క‌ష్టమ‌వుతుందని సుప్రీంకు విన్నవించారు. నీట్ లో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులే రాణించ‌గ‌ల‌రని న్యాయస్థానానికి తెలిపారు. మరోవైపు నీట్‌తో తమ రాష్ట్రంలోని 60 వేల మంది విద్యార్థులపై ప్రభావం పడుతుందని గుజరాత్‌ ప్రభుత్వం కూడా తమ వాదనను వినిపించింది. అందరి వాదనలు విన్న సుప్రీం కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.
« PREV
NEXT »

No comments

Post a Comment