తాజా వార్తలు

Monday, 2 May 2016

నీట్ పై విచారణ జరపనున్న సుప్రీం …

నీట్ ఎగ్జామ్ నుండి తెలుగు రాష్ట్రాల‌ను మిన‌హాయించాల‌ని కోరుతూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల‌తో పాటు జమ్మూకశ్మీర్, తమిళనాడు తదితర రాష్ట్రాలు కూడా ఈ అంశంపై సుప్రీంను ఆశ్రయించాయి.
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం కోసం ఇప్పటికే నోటిఫికేష‌న్ విడుద‌ల చేశామ‌ని ప్రవేశపరీక్షలను యథాతథంగా జరుపుకునేందుకు అనుమ‌తినివ్వాల‌ని ఈ రాష్ట్రాలు కోర‌నున్నాయి. ఈరోజు మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు నీట్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల‌కున్న ప్రత్యేక హక్కులను సుప్రీంలో ప్రస్తావించ‌నున్నారు. మరి నీట్ పై సుప్రీం ఏ తీర్పునిస్తుందో అని అందరిలో ఉత్కంఠ నెలకొంది.
« PREV
NEXT »

No comments

Post a Comment