తాజా వార్తలు

Saturday, 7 May 2016

సైకిలెక్కనున‌్న కర్నూల్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి…

ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వివిధ జిల్లాల నుండి 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు. తాజాగా వైసీపీ కర్నూలు శాసనసభ్యుడిగా ఉన్న ఎస్వీ మోహన్ రెడ్డి నేడు కర్నూలులోనే టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తన సొంత గూటికి చేరనున్నారు.
వైసీపీకి గట్టి పట్టున్న కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియలతో మొదలైన జంపింగ్ ల పర్వం ఆ జిల్లాలో వైసీపీని దాదాపుగా ఖాళీ చేసేలా సాగుతుంది. నిన్ననే వైసీపీకి రాజీనామా చేసిన ఎస్వీ మోహన్ రెడ్డి.., కర్నూల్ లో దీక్ష గురించి తనకు ఒక్క మాట కూడా చెప్పలేదని ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి వైఖరి కారణంగానే తాను పార్టీ మారుతున్నట్లు పేర్కొన్నారు. ఎస్వీతో పాటు ఆయన అనుచరవర్గం కూడా టీడీపీలోకి చేరనుంది.
« PREV
NEXT »

No comments

Post a Comment