తాజా వార్తలు

Saturday, 21 May 2016

దేశంలోనే అత్యధిక ధనవంతులున్న అసెంబ్లీ…

దేశంలోనే అత్యధిక ధనవంతులున్న అసెంబ్లీ ఏదో తెలుసా…? మరేదో కాదండి మన పక్క రాష్ట్రం తమిళనాడు. ఈ సంవత్సరం ఎన్నికల్లో గెలిచిన వారిలో 170మంది కోటీశ్వరులు ఉన్నారట. ఎన్నికల సమయంలో వారు సమర్పించుకున్న అఫిడవిట్ లెక్కల ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి.
అక్కడ ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే సగటు ఆస్తి రూ. 8.21 కోట్లుగా తేలింది. ఇక ఈ సారి ఏదొక విషయంలో ఆరోపణలు, క్రిమినల్ కేసులు ఎదుర్కొన్న వారు కూడా చాలా మంది ఉన్నారండోయ్. ఇందులో కేరళలో 62 శాతం మంది గెలిచిన వారిపై క్రిమినల్ కేసులు ఉండగా, తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో 37 శాతం మందిపై కేసులున్నాయి. అంతేకాకుండా వీరిలో ఘోర నేరాలు చేసిన ఆరోపణలను ఎదుర్కొంటున్న వారు 32 శాతం మంది ఉన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment