తాజా వార్తలు

Thursday, 5 May 2016

’24’ రివ్యూ వచ్చేసింది…

బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ’24’ సినిమాను పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. ఈ రోజు ’24’ ప్రివ్యూ చూసిన తరుణ్, తన భావాలను ట్విట్టర్ లో షేర్ చేసుకున్నాడు. ఈ సినిమాను కేవలం బాగుంది అని చెప్పలేమని, ఇందులో చాలా మంచి అంశాలు ఉన్నట్లు తెలిపారు. తన నైపుణ్యాన్ని మొత్తం ’24’ సినిమాలో డైరక్టర్ విక్రమ్ చూపించారని తెలిపారు.
మూడు పాత్రలలో సూర్య అత్యద్భుతంగా నటించాడని ప్రశంసించాడు. సూర్యది అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్ అని ఆకాశానికెత్తేశాడు. ఇంత మంచి సబ్జెక్టును తీసుకున్నందుకు మొత్తం సినిమా టీమ్‌కు తన అభినందనలు అని ఆదర్శ్ అన్నాడు. ఇలాంటి సినిమా తీయాలంటే దమ్ము, ఫైనాన్సియల్ సపోర్ట్ చాలా ఉండాలని, టైటిళ్ల నుండే ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తుందని, తర్వాత 2.40 గంటల పాటు ఒక రోలర్ కోస్టర్‌లో తిరుగుతున్నట్లుగా అద్భుతమైన అనుభూతికి లోనవుతారని తరణ్ అన్నాడు. ఇందులో కావల్సినంత వినోదం, ఎవరూ ఊహించలేని ట్విస్టులు, మలుపులు ఉంటాయంటూ ప్రేక్షకులను మరింత ఊరించాడు ఆదర్శ్. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉందో తేలాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.
« PREV
NEXT »

No comments

Post a Comment