తాజా వార్తలు

Wednesday, 25 May 2016

అనంతలో ఒంటరైన ఎమ్మెల్యే చాంద్ బాషా !

► టీడీపీలో  చాంద్‌బాషాకు వరుసగా ఎదురుదెబ్బలు
► టార్గెట్ చేసిన పయ్యావుల, కందికుంట
► మినీమహానాడు నుంచి మధ్యలోనే వెనుదిరిగిన చాంద్
► కందికుంట పంచన చేరిన కీలక అనుచరుడు కేఎం బాషా
 ‘అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి’ అన్నట్లుంది కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా పరిస్థితి.  టిక్కెట్టు ఇచ్చి ఎమ్మెల్యేను చేసిన వైఎస్సార్‌సీపీని కాదని టీడీపీలో చేరారు. ఈయన రాకను మొదటి నుంచి టీడీపీలో ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయినా  సైకిలెక్కారు. చేరిక తర్వాత చాంద్‌కు టీడీపీ నేతలు చుక్కలు చూపిస్తున్నారు. ప్రతి వేదికపై టార్గెట్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఆయన వెనుక ఉన్న నేతలను కూడా దూరం చేస్తూ ఒంటరిని చేస్తున్నారు. ఈ పరిణామాలతో చాంద్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వైఎస్సార్‌సీపీలో ప్రత్యేక గౌరవం ఉండేదని, పార్టీ మారడంతో జనంలో కూడా చులకన య్యానని మదనపడుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment