తాజా వార్తలు

Friday, 27 May 2016

కేసీఆర్‌ గొప్ప ఇంజినీరంటున్న హరీష్‌రావు…

తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఓ ఇంజనీర్‌లా బంగారు తెలంగాణ కోసం ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని మంత్రి హరీష్‌ రావు అన్నారు. ఇరిగేషన్‌ డిపార్టుమెంట్‌లో కొత్తగా.. జూనియర్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్లకు హరీష్‌ నియామక పత్రాలు అందజేశారు.
జూనియర్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్లంతా బంగారు తెలంగాణకు వారధులు కావాలని హరీష్‌ ఆకాంక్షించారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీల్లో భాగంగా ఇప్పటికే 40 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి కావొస్తోందని హరీష్‌రావు అన్నారు.
తెలంగాణ నుంచి వలసలు ఆగాలంటే… రైతుల ఆత్మహత్యలు చేసుకోవద్దంటే… గ్రామాలు సస్యశ్యామలం కావాలన్నారు హరీష్‌రావు. గోదావరి నుంచి వృథాగా సముద్రంలోకి వెళ్తున్న నీటిని వాడుకుంటే సమస్య పరిష్కారమవుతుందన్నారు. ”నా తెలంగాణ కావాలి… కోటి ఎకరాల మాగాణం” అన్నారు హరీష్‌రావు..
« PREV
NEXT »

No comments

Post a Comment