తాజా వార్తలు

Thursday, 26 May 2016

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలను తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విడుదల చేశారు. ఈ నెల 15న నిర్వహించిన ఎంసెట్-2016 ప్రవేశ పరీక్షకు ఇంజినీరింగ్ విభాగంలో 1,33,428 మంది విద్యార్థులు పరీక్ష రాయగా మెడికల్ విభాగంలో 90,114 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైయ్యారు. అభ్యర్థులు జూన్ 6వ తేదీనుంచి ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇంజినీరింగ్ విభాగంలో 160 మార్కులతో తళ్లూరి సాయితేజ మొదటి ర్యాంక్‌ సాధించగా… 159 మార్కులతో దిగుమర్తి చేతన్‌సాయి రెండవ ర్యాంక్‌, 158 మార్కులతో గుండా నిఖిల్ సామ్రాట్ మూడవ ర్యాంక్‌, 158 మార్కులతో కొండా విఘ్నేష్‌రెడ్డి నాల్గొవ ర్యాంక్‌, 158 మార్కులతో చుండూరు రాహుల్ ఐదవ ర్యాంక్‌, 157 మార్కులతో బండారు వెంకటసాయి గణేష్ ఆరోర్యాంక్‌, 157 మార్కులతో కొండేటి తన్మయి ఏడవ ర్యాంక్‌, 157 మార్కులతో గంటా గౌతమ్‌ ఎనిమిదవ ర్యాంక్‌, 157 మార్కులతో నంబూరి జయకృష్ణ సాయివినయ్ తొమ్మిదవ ర్యాంక్‌, 157 మార్కులతో సత్తి వంశీ కృష్ణారెడ్డి పదవ ర్యాంక్‌ సాధించాడు.
ఇక ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ మినహాయించి ఇతర వైద్య కోర్సుల్లో… బి.ప్రదీప్‌ రెడ్డి, ఎస్‌. ప్రత్యూష, ఎమ్‌. అర్బాజ్‌, వి. ప్రణతి, ఎ. యజ్ఞప్రియ, జీషన్‌ అహ్మద్‌ జలీలి 160 మార్కులు సాధించగా… ఆర్‌.ఉజ్వల్‌, టి. కౌశిక్‌, పి.శైలజ, ఎ.శ్రీనిధి 159 మార్కులు సాధించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment