తాజా వార్తలు

Monday, 30 May 2016

భూసేకరణలో వేగం పెంచాలన్న హరీష్‌…

మిషన్ కాకతీయ మూడో దశలో టెండర్ల ప్రక్రియలో పారదర్శకతను పాటించాలన్నారు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. సెక్రటేరియట్‌లో మిషన్ కాకతీయ మొదటి, రెండో దశల పురోగతిని మంత్రి సమీక్షించారు హరీష్‌రావు. నీటి పారుదల ప్రాజెక్టులు, భూసేకరణ, మిషన్ కాకతీయ పనులపై చర్చించారు.
సమీక్ష సమావేశంలో మెదక్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల కలెక్టర్లతో పాటు ఇరిగేషన్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడారు. మిషన్ కాకతీయ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు హరీష్‌రావు
నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో సీఎం కేసీఆర్‌ వేగాన్ని పెంచడానికి భూసేకరణ ప్రధాన సమస్యగా మారిందని మంత్రి హరీష్ రావు అన్నారు. దేవాదుల, ప్రాణహిత, డిండి, ఉదయసముద్రం, ఎస్ ఎల్ బిసి ప్రాజెక్టులలో భూసేకరణ ప్రక్రియను ముమ్మరం చేయాలని కలెక్టర్లను కోరారు హరీష్‌రావు.
« PREV
NEXT »

No comments

Post a Comment