తాజా వార్తలు

Wednesday, 18 May 2016

ఆవిర్భావ వేడుకలకు రండి…

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై ఏర్పాటైన కేబినెట్ సబ్‌కమిటీ గవర్నర్‌ నరసింహన్‌ను కలిసింది. జూన్‌ రెండు నుంచి జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్నాలని ఆయను ఆహ్వానించారు మంత్రులు. గవర్నర్ ను కలిసిన వారిలో హోంమంత్రి నాయిని, మంత్రులు కేటీఆర్, ఈటెల ఉన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రావతరణ నిర్వహణ బాధ్యతలను హోం మంత్రి నాయిని నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా పలువురిని ఈ ఉత్సవానికి ఆహ్వానించనున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఈ సంవత్సర సంబరాలు అంబరాన్ని తాకేలా వేడుకలు జరిపేలా సీఎం కేసీఆర్ ప్లాన్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ వివిధ కార్యక్రమాల్ని నిర్వహించబోతున్నారు. అలాగే జూన్‌ రెండో తేదీన అమర వీరుల కుటుంబాలను సన్మానించనున్న తెలంగాణ సర్కార్‌. 1969 ఉద్యమంలో పాల్గొన్న వారికి, విశిష్ట సేవలందించిన వారికి అవార్డులు అందజేయనుంది. ఇటు ట్యాంక్‌బండ్‌పై అదేరోజు సాయంత్రం ప్రభుత్వ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సంబరాలకు వెలుగులు తేవాలని దీనికి అవసరమయ్యే ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.
« PREV
NEXT »

No comments

Post a Comment