తాజా వార్తలు

Monday, 16 May 2016

మహానాడు కోసం ముమ్మర ఏర్పాట్లు…

ఈ నెల 27 నుంచి తిరుపతిలో జరిగే మహానాడు కోసం తెలుగు దేశం పార్టీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. గత మహానాడుల కంటే భిన్నంగా, కొత్త హంగులతో , హైటెక్‌ విధానంలో ఈ సంవత్సరం మహానాడు జరగబోతోంది. మహానాడుకు సమయం దగ్గరపడుతుండటంతో కమిటీతో ప్రత్యేకంగా సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు చంద్రబాబు.
ఇక మహానాడుకు 30 వేల మంది ప్రతినిధులను ఆహ్వానిస్తున్నారు. ఎస్‌ఎంఎస్‌లు, వాయిస్‌ మెసేజ్‌ల ద్వారా కూడా ఆహ్వానాలను పంపుతున్నారు. ఇన్విటేషన్ ఉన్న వారికే ప్రాంగణంలోకి అనుతించేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతినిధులు బయటకు వెళ్ళి వచ్చిన ప్రతిసారీ కార్డ్ స్వైపింగ్ చేయాలి. మూడు రోజుల్లో ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎంతసేపు ఉన్నారన్నది మొబైల్‌ఫోన్ల ద్వారా మానిటరింగ్ చేయనున్నారు. ఇందుకోసం అన్ని హంగులతో మహానాడు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ వంటకాలతో మూడు రోజుల మహానాడుకు మెనూ సిద్దం చేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment