తాజా వార్తలు

Monday, 23 May 2016

మండలి సభ్యత్వానికి తుమ్మల రాజీనామా

రాష్ట్ర రోడ్లు భవనాలు, స్త్రీ,శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు  సోమవారం మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు రాజీనామా లేఖ పంపగా ఆయన ఆమోదించారు. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించడంతో తుమ్మల ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని వదులుకున్నారు. ఈ నెల 26న ఎమ్మెల్యేగా తుమ్మల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, తుమ్మల రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవి కోసం అధికార పార్టీలో అప్పుడే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. పలువురు ఆశావహులు తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని పార్టీ అధినేత కేసీఆర్‌కు విన్నవించుకుంటున్నారు.

 తుమ్మలను అభినందించిన సీఎం
 సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పాలేరు ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనకు అభినందనలు తెలి పారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎస్‌బి.బేగ్, కొండబాల కోటేశ్వరరావు, పిడమర్తి రవి, నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment