తాజా వార్తలు

Thursday, 26 May 2016

రాజ్యసభ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు డీఎస్‌, కెప్టెన్‌…

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్ధులను కేసీఆర్ ప్రకటించారు. డి.శ్రీనివాస్, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావులకు అవకాశం కల్పించారు. తుమ్మల ఎమ్మెల్సీ స్థానంలో మాజీ మంత్రి ఫరీదుద్దీన్‌కు ఛాన్స్ ఇచ్చారు. ఎన్నికల పర్యవేక్షకులుగా మంత్రులు నాయిని, ఈటెల వ్యవహరించనున్నారు.
తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న కాంగ్రెస్‌ ఎంపీ వీహెచ్‌, టీడీపీ ఎంపీ గుండు సుధారాణి పదవికాలం జూన్ 2వ తేదీతో ముగియనుంది. అయితే ఈ సారి తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో కాంగ్రెస్, టీడీపీలు ఈసారి తమ అభ్యర్థులను రాజ్యసభకు పంపే అవకాశం లేదు. దీంతో ఖాళీ అయిన స్థానాలకు పూర్తి సంఖ్యాబలం కలిగిన టీఆర్‌ఎస్ తమ అభ్యర్థులను పంపే అవకాశం దక్కించుకుంది.
రాజ్యసభ ఎన్నికలకు ఈ నెల 31 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. జూన్ 1వ తేదీన నామినేషన్ల పరిశీలన, జూన్ 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు. జూన్ 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. 11న సాయంత్రం ఓట్లు లెక్కించి… ఫలితాలు ప్రకటించనున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment