తాజా వార్తలు

Thursday, 19 May 2016

పాలేరు కూడా టీఆర్ఎస్ దే…

ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు విజయకేతనం ఎగరవేశారు. తన ప్రత్యర్థి సుచరితా రెడ్డిపై 46వేల ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలిచారు. దీంతో వరుసగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది టీఆర్ఎస్. టీఆర్ఎస్, సీపీఐ మినహా మిగిలిన పార్టీలన్నీ సుచరితా రెడ్డి తరపున ప్రచారం చేసినా.., విజయాన్ని మాత్రం సాధించలేకపోయాయి. పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఈ నెల 16న అక్కడ ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో వెంకట్ రెడ్డి భార్య సుచరితా రెడ్డి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగారు.
« PREV
NEXT »

No comments

Post a Comment