తాజా వార్తలు

Thursday, 12 May 2016

ముస్లింలపై మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు…

రిపబ్లికన్ల తరపున అమెరికా అధ్యక్ష పదవికి బరిలోకి దిగుతున్న డోనాల్డ్ ట్రంప్ ముస్లింలపై మరోసారి తన ద్వేషాన్ని చాటుకున్నారు. విదేశీ ముస్లింలను అమెరికాలోకి రాకుండా నిషేధం విధించే విషయంపై అధ్యయనం చేసేందుకు కౌంటర్ టెర్రరిజమ్ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇది ప్రపంచమంతా ఎదుర్కొంటున్న సమస్య అని, అమెరికా ఇందులో స్మార్ట్‌గా వ్యవహరించాలని ట్రంప్ సూచించారు.
మరోవైపు ట్రంప్ వస్తేనే మానవత్వం నిలుస్తుందని ఓ హిందూ సంస్థ ఆయన గెలవాలని పూజలు, హోమాలు చేస్తోంది. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న హిందూ సేనా నేషనలిస్ట్ గ్రూప్, జంతర్ మంతర్ వద్ద ట్రంప్ గెలుపు కోసం హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేసింది. దేవతలంతా ట్రంప్ గెలుపునకు సహకరించాలని కోరుకుంటున్నట్టు హిందూసేన వ్యవస్థాపకుడు విష్ణు గుప్తా ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రపంచాన్ని ఇస్లామిక్ టెర్రరిజం నుంచి కాపాడాలంటే అది ట్రంప్ కే సాధ్యమని ఆయన అన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment