తాజా వార్తలు

Friday, 27 May 2016

సాండర్స్ తో డిబేట్‌కు 67 కోట్లు అడిగిన ట్రంప్‌!

డొనాల్డ్ ట్రంప్… ఈ పేరంటేనే వివాదాలకు చిరునామాగా మారిపోయింది. రిపబ్లికన్ల తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న ట్రంప్‌… తొలి నుంచీ వివాదాస్పదుడే. బిలియనీర్ బిజినెస్‌మేన్‌గా… సెలబ్రిటీగా ఉంటూ ప్రభుత్వంపై ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వాడు ట్రంప్‌.
అయితే తాజాగా మరోసారి తాను మంచి బిజినెస్ మెన్ అనిపించుకున్నారు ట్రంప్‌… డెమోక్రటిక్ పార్టీ తరపున ప్రెసిడెంట్ అభ్యర్థిత్వం కోసం హిల్లరీ క్లింటన్ తో పోటీ పడుతున్న బెర్నీ సాండర్స్ తో డిబేట్ లో పాల్గొంటారా అంటూ… జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగేలా చేశాడు ట్రంప్‌.
బెర్నీ సాండర్స్‌తో డిబేట్‌కు సిద్ధమే… కానీ, నాకు 10 మిలియన్ డాలర్లు ఇస్తారా అంటూ… ట్రంప్‌ ఎదురు ప్రశ్న వేయడంతో జర్నలిస్టులు బిత్తరపోయారు. డిబేట్ నిర్వహించే మీడియా సంస్థ ఇచ్చే ఆ డబ్బుతో చారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తానని ట్రంప్ వెల్లడించారు. 10 మిలియన్‌ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు 67 కోట్లు మరి.
సాండర్స్ తో డిబేట్ కు మంచి రేటింగ్ లభిస్తుందని అభిప్రాయపడ్డారు ట్రంప్‌. సాండర్స్ తనకు లవబుల్ పర్సన్ అని, ఆయనతో డిబేట్ తనకు ఇష్టమన్నారు. మరోవైపు సాండర్స్ కూడా ఈ డిబేట్ కు తాను సిద్ధమంటూ సంకేతాలిచ్చారు.
« PREV
NEXT »

No comments

Post a Comment