తాజా వార్తలు

Thursday, 19 May 2016

తైవాన్ కు తొలి మహిళా అధ్యక్షురాలు…

తైవాన్‌లో ప్రెసిడెంట్ పదవికి తొలిసారిగా ఓ మ‌హిళా ప్రమాణ స్వీకారం చేసింది. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ లో కీలకమైన వ్యక్తిగా పేరు గాంచిన సాయ్‌ ఇంగ్‌ వెన్ తైవాన్ అధ్యక్షురాలుగా ఎన్నికైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.., “చైనాతో మంచి వాతావర‌ణం ఏర్పర‌చుకునేందుకు, త‌మ దేశంతో చైనాకు స‌త్సంబంధాలు ఏర్పర‌చేందుకు కృషి చేస్తానని తెలిపారు.
అలాగే తైవాన్ ఆర్థిక వ్యవస్థను బలపరిచేందుకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. తైవాన్ అధ్యక్షురిలా ఈమె ఎంపికపై ఇంటర్నేషనల్ పత్రికలు హర్షాన్ని వ్యక్తం చేశాయి. తైవాన్ దేశాన్ని వేర్పాటు ప్రాంతంగా ప‌రిగ‌ణిస్తోన్న చైనాతో శాంతియుతంగా స‌మ‌స్యను ప‌రిష్కరించేందుకు సాయ్ ఇంగ్ వెన్ నే కరెక్ట్ అని అందరూ అభిప్రాయపడుతున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment