తాజా వార్తలు

Wednesday, 25 May 2016

రాష్ట్రంలో ఫాంహౌస్ పాలన సాగుతోంది


రాష్ట్రంలో ప్రస్తుతం ఫాంహౌస్ పాలన కొనసాగుతుందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ  విమర్శించారు. నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమన్నారు. హైదరాబాద్‌లో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఒక్క కేసీఆర్ కుటుంబం మినహా ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడతామన్నారు.  

 కేసీఆర్ కుటుంబంపై పోరాటం: మోత్కుపల్లి
 తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వారంతా ప్రస్తుత ప్రభుత్వాన్ని చూసి లెంపలు వేసుకుంటున్నారని టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ పరంగా కొన్ని పొరపాట్లు జరిగాయని పేర్కొన్నారు. సెంటిమెంటు వల్లే ఆ ఎన్నికల్లో ఎక్కువగా నష్టపోయామని విశ్లేషించారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఘనమైన చరిత్ర తెలంగాణకు ఉందని, సీఎం కేసీఆర్ కుటుంబంపైనా పోరాడక తప్పదని మోత్కుపల్లి వివరించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment