తాజా వార్తలు

Wednesday, 18 May 2016

పాలేరులో దూసుకుపోతున్న తుమ్మల

ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో ఆయన సతీమణి సుచరిత కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి దిగారు. ఆమెకు ప్రతిపక్షాలన్నీ మద్దతుగా నిలిచాయి.

కానీ అధికార టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో రెండు రౌండ్లు ముగిసేసరికి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థిని సుచరితపై 9,610 ఓట్ల ఆధిక్యం సాధించారు. భారీ ఆధిక్యంతో తామిక్కడ విజయం సాధించడం ఖాయమని టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది.

« PREV
NEXT »

No comments

Post a Comment