తాజా వార్తలు

Saturday, 21 May 2016

అమెరికా పర్యటనకు మంత్రి కేటీఆర్

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే నిమిత్తం పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అమెరికా పర్యటనకు శనివారం బయలుదేరి వెళ్లారు. ఈనెల 23 నుంచి జూన్ 1 వరకు అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అక్కడి ఫార్మాస్యూటికల్, ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలను సందర్శించి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన పారిశ్రామిక విధానం ద్వారా ఇస్తోన్న ప్రోత్సాహకాలను ఆయా సంస్థల ప్రతినిధులకు వివరించనున్నారు. ఇండియానా పొలిస్ నగర మేయర్ హాగ్‌సెట్, లోవా రాష్ట్ర గవర్నర్ బర్న్‌స్టాడ్ తదితరులతో కేటీఆర్ సమావేశం కానున్నారు. అమెరికా వెళ్లిన ప్రతినిధుల బృందంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు ఉన్నారు.

« PREV
NEXT »

No comments

Post a Comment