తాజా వార్తలు

Friday, 27 May 2016

హిరోషిమా మృతులకు ఒబామా నివాళి…

అణ్వాయుధాలు లేని ప్రపంచం కోసం అన్ని దేశాలు కృషి చేయాలన్నారు అమెరికా అధ్యక్షుడు ఒబామా. నిరసనల మధ్యే హిరోషిమాలో అడుగుపెట్టిన ఒబామా హిరోషిమా స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించారు.
రెండో ప్రపంచం యుద్ధంలో సర్వనాశమైన హిరోషిమాలోని అనేక ప్రాంతాల్లో ఒబామా పర్యటించారు. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అమెరికా అధ్యక్షుడు హిరోషిమాను సందర్శించడం ఇదే తొలిసారి. బాధిత కుటుంబాలను నేరుగా కలుసుకున్న ఒబామా వారితో మాట్లాడారు.
హిరోషిమా స్మారక స్థూపం దగ్గర పుష్ప గుచ్చాన్ని ఉంచి నివాళులర్పించారు ఒబామా. ఆ తర్వాత ఒక నిమిషం పాటు కళ్లు మూసుకున్నారు. 1945 ఆగస్టు 6న అణు బాంబు దాడితో హిరోషిమాలో 1,40,000 మంది మృతిచెందారు.
« PREV
NEXT »

No comments

Post a Comment