తాజా వార్తలు

Saturday, 21 May 2016

కేసీఆర్ బెదిరింపులకు భయపడం: ఉత్తమ్


ప్రతిపక్షాలపై కేసులు పెడతామని, జైల్లో పెడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ బెదిరిస్తే భయపడేది లేదని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీభవన్‌లో దివంగత నేతకు పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు, అలాగే సోమాజీగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్ అలీ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు, వాటి అమలులో వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పార్టీ నేతలంతా రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు. ఎంపీలు వి.హనుమంతరావు, కె.వి.పి.రామచందర్‌రావు, పీఏసీ చైర్మన్ జె.గీతారెడ్డి, మాజీమంత్రులు డి.శ్రీధర్‌బాబు, ప్రసాద్‌కుమార్, ఇతర నేతలు, వివిధ అనుబంధసంఘాల అధ్యక్షులు రాజీవ్‌కు నివాళులర్పించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment