తాజా వార్తలు

Thursday, 26 May 2016

వివరణ ఇచ్చిన వర్మ…

అసోం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన నటి అంగూర్ లతా దేకాపై రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్లకు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “మార్స్‌ గ్రహం మీదకు వెళ్లినా సరే ఈ మనుషుల బుద్ధి మారదు గాక మారదు అంటూ, తనకున్న సెలబ్రిటీ హోదాను ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగించుకుంటాను తప్ప ఇటివంటి ఛీప్‌ కామెంట్స్‌కు స్పందించను అంటూ ఈ ఘాట్లపై లతా దేకా స్పందించింది.
ఇక నెటిజన్లు కూడా ట్విట్టర్లో వర్మపై మండిపడుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన యువతిపై వర్మ మాటలు చూస్తుంటే ఆడవారి పట్ల ఆయనకు ఉన్న గౌరవం ఏమిటో తెలుస్తొందని ఒకరు, వర్మ వ్యాఖ్యలు సిగ్గుపడాల్సిన విషయమని మరొకరు, ఆయన వ్యాఖ్యలతో తాను అసంతృప్తికి గురయ్యానని ఇంకొకరు ట్వీట్ చేశారు. ఓ యువ ఎమ్మెల్యే గెలిస్తే మద్దతివ్వాల్సింది పోయి అలా వ్యాఖ్యానించడం విడ్డూరమంటూ వర్మను దుమ్మెత్తిపోస్తున్నారు. ఓ మహిళ గతంలో నటి అయినంత మాత్రన ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు శృతి మించిన కోణంలో వాఖ్యానించడమేమిటని కొందరు విమర్శిస్తున్నారు. నెటిజన్ల ఆగ్రహంతో దిగివచ్చిన వర్మ తాను చేసిన ట్విట్టర్‌ పోస్ట్‌కు వివరణ ఇచ్చుకున్నాడు. తాను ఆమె అందాన్ని పొగిడానని అది కాంప్లిమెంటే తప్ప కించపరచడం కాదని చెప్పాడు.
« PREV
NEXT »

No comments

Post a Comment