తాజా వార్తలు

Saturday, 14 May 2016

రాష్ర్ట ప్రయోజనాలు పణంగా పెట్టారు: బొత్స

‘ఓటుకు కోట్లు’ కేసు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టారని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. ఈ కేసులో అరెస్టు కాకుండా తప్పించుకునేందుకే చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో లాలూచీ పడ్డారని, అందువల్లే తెలంగాణలో పెద్దఎత్తున ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నా నోరు మెద పట్లేదని విమర్శించారు. శుక్రవారం నగర పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల తో మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యం వల్ల తెలంగాణ లో పెద్దఎత్తున ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 16 నుంచి మూడు రోజులపాటు కర్నూలులో దీక్ష చేపడుతున్నారని చెప్పారు. దీనికి సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా 17న మండల కేంద్రాల్లో ఒకరోజు నిరసన దీక్షలు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.

 రేపోమాపో ‘పనామా’లో బాబు పేరు కూడా రావొచ్చు..
 విదేశాల్లో నల్లధనం దాచుకున్నవారిలో హెరిటేజ్ డెరైక్టర్ కూడా ఉండడం చూస్తుంటే రేపోమాపో చంద్రబాబుతో సహా మరింత మంది పేర్లు బయటకొచ్చే అవకాశం కన్పిస్తోందని బొత్స అన్నారు. ఈ విషయంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment