తాజా వార్తలు

Thursday, 19 May 2016

ఫలితాలు సంతృప్తిగా ఉన్నాయి…

తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అసోం, పుదుచ్చేరి లో ఎన్నికల ఫలితాలు తమకు సంతృప్తిని కలిగించాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఈ సందర్భంగా తమ పార్టీకి ఓటేసిన వారికి ఆయన కృతఙ్ఞతలు తెలియజేశారు. 2011 ఎన్నికల్లో 5 శాతం ఓట్లకు పరిమితమైన తమ పార్టీ, ఈ ఎన్నికల్లో 15 శాతం ఓట్లను పొందిందని, ఎన్నో చోట్ల విజేతలకు గట్టిపోటీని ఇచ్చిందని వివరించారు. ఇక ఈ ఎన్నికల్లో మిగతా అన్ని చోట్ల అనుకున్న విధంగా సీట్లు సంపాదించకపోయినా.., అసోం లో మాత్రం బీజేపీ రికార్డ్ ను క్రియేట్ చేసింది. అక్కడ తొలిసారిగా విజయకేతనం ఎగురవేసింది.
« PREV
NEXT »

No comments

Post a Comment