తాజా వార్తలు

Saturday, 7 May 2016

హార్టికల్చర్ హబ్ గా కడప…

కడపను హార్టికల్చర్ హబ్ గా మారుస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ రోజు కడప జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు అక్కడ ఉద్యాన పంటల రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు రుణ ఉపశమన పత్రాలను పంపిణీ చేశారు. వ్యవ‌సాయం చేసే వారి ఆదాయం త‌క్కువగా ఉందని, ఆ ప‌రిస్థితి నుంచి వారిని బ‌య‌ట ప‌డేందుకు టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుంద‌ని పేర్కొన్నారు. రైతులను రుణవిముక్తులను చేసేందుకే రాష్ట్రవ్యాప్తంగా రూ.24వేల కోట్లు రుణమాఫీ చేసినట్లు తెలిపారు. ఇక పులివెందుల‌లో ప్రతీ ఎక‌రాకు నీళ్లు అందిస్తామ‌ని, రుణమాఫీ గురించి మాట్లాడే హక్కు ప్రతిపక్షానికి లేదని అన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment