తాజా వార్తలు

Thursday, 5 May 2016

ప్రజల కోసం కలిసి పోరాడుదాం…

వారితో మాకు పడకపోయినా.., రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశంతో కలిసి పోరాడేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఏపీకీ ప్రత్యేక హోదా సాధించుకోవాలంటే కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, మిగిలిన పార్టీ నాయకుల సలహాలు తీసుకోవాలని ఆయన సూచించారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చేందుకు చంద్రబాబునాయుడు మార్గదర్శకంగా ఉండి, ఒక ఉద్యమరూపం తీసుకురావాలని కోరారు. కేంద్రంలో టీడీపీ మంత్రులను, ఏపీలో బీజేపీ మంత్రులను కొనసాగిస్తూ ప్రత్యేకహోదా కోసం పోరాడతామంటే కుదరదని, ఈ పద్ధతేంటో తనకు అర్థం కావట్లేదని అంబటి రాంబాబు ఈ సందర్భంగా విమర్శించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment