తాజా వార్తలు

Wednesday, 25 May 2016

ఏమి సాధించారని మినీ మహానాడులు

రాష్ట్రంలో ఏమి అభివృద్ధి సాధించి మినీమహానాడులు టీడీపీ నేతలు నిర్వహిస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. కావలిలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.

అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినా ప్రజలకు ఏమి చేయలేదని ఓట్లు వేసిన ప్రజలే టీడీపీని చీదరించుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ మా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శిస్తూ  రెండేళ్లు గడిపారన్నారు. ఇచ్చిన హామీలు గాలికి వదిలివేసి అవి నీతిలో మునిగిపోయారన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ కార్యకర్తలను నియమించి అభివృద్ధి సాధించామంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జలదీక్ష చేస్తే టీడీపీ నేతలు విమర్శించడం శోచనీయమన్నారు. రైతుల పక్షాన మా అధినేత ఎప్పుడూ పోరాడుతూ ఉంటారన్నారు.  నెల్లూరు ఎంపీ రాజమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ప్రజల కోసం పోరాడుతామన్నారు. కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి వ్యక్తిత్వం తెలిసిన ఎవరైనా వైఎస్సార్‌సీపీని వీడుతారని అనుకోర న్నారు.  పార్టీ ఫిరాయించిన వారికి అవమానాలు తప్ప, ప్రయోజనాలు ఏమీ ఉండవన్నారు. ప్రజలు వీరి చేష్టలపై ఆగ్రహంతో ఉన్నారని 2019లో తిరుగులేని శక్తిగా వైఎస్సార్‌సీపీ అవతరించి అధికారంలోకి వస్తుందన్నారు.  
 
ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నెమాల సుకుమార్‌రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కనమర్లపూడి వెంకటనారాయణ, డీఆర్‌యూసీసీ సభ్యుడు కుందుర్తి కామయ్య, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్యద ర్శి శ్రీనివాసులు, సేవాదళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పందిటి కామరాజు, జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment