తాజా వార్తలు

Saturday, 28 May 2016

'పదవి కోసం చంద్రబాబు సాగిలపడ్డారు'

ముఖ్యమంత్రి పదవి కోసం సాగిలపడిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అడగడం మానేశారని వైఎస్ఆర్ సీపీ నేత, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఒంగోలులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ మాట మారుస్తోందని చెప్పారు.

ప్రత్యేక హోదా సాధించేంత వరకు వైఎస్ఆర్ సీపీ పోరాటం చేస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులపై వేటు తప్పదని హెచ్చరించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో ఇప్పటికే కేసు వేశామని  వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
« PREV
NEXT »

No comments

Post a Comment