తాజా వార్తలు

Wednesday, 25 May 2016

ఐపీఎల్‌లో పాక్‌ క్రికెటర్లకు అవకాశం ఇవ్వండి

పాక్‌ క్రికెటర్లకు ఐపీఎల్‌లో చోటు కల్పించాలని ఐసీసీ అధ్యక్షుడు జహీర్ అబ్బాస్ బీసీసీఐకి విజ్ఞప్తిచేశారు. బెంగళూరులో ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ చూసేందుకు అబ్బాస్‌ రానున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఆహ్వానం మేరకు ఈ పాక్ మాజీ కెప్టెన్ బెంగళూరుకు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో తమ దేశ ఆటగాళ్లను లీగ్ లో ఆడనిస్తే ఐపీఎల్‌కు మరింత జోష్ వస్తుందంటున్నారు జహీర్‌ అబ్బాస్‌.
ఐపీఎల్ ఫస్ట్‌ సీజన్‌లో పాక్ క్రికెటర్లు భాగస్వాయులయ్యారని… ముంబై దాడుల తర్వాత తమ ఆటగాళ్లను లీగ్ నుంచి నిషేధించిన విషయాన్ని అబ్బాస్‌ గుర్తుచేశారు. ప్రపంచమంతా భారత్-పాక్ మ్యాచుల కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుందని… ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మెరుగు పడేందుకు కృషిచేస్తానన్నారు జహీర్ అబ్బాస్.
« PREV
NEXT »

No comments

Post a Comment