తాజా వార్తలు

Friday, 3 June 2016

పేలిన జిలెటిన్‌స్టిక్స్..ఒకరి మృతి

కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం మోతె గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. బండరాళ్ల మధ్య పెట్టిన జిలెటిన్‌స్టిక్స్ అకస్మాత్తుగా పేలి శ్రీనివాస్(25) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా..అశోక్(30) అనే మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన అశోక్‌ను జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడి స్వస్థలం ధర్మపురి మండలం చిన్నాపూర్ గ్రామం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment