తాజా వార్తలు

Friday, 3 June 2016

వేర్వేరు హత్యకేసుల్లో ఇద్దరికి జీవితఖైదు

వేర్వేరు హత్యకేసుల్లో ఇద్దరికి శుక్రవారం జీవితఖైదు పడింది. వివరాలు..కామారెడ్డి పట్టణంలోని హరిజనవాడకు చెందిన బైరపు చిన్నరాజయ్య(33) 2015 ఆగస్టు 12న కుటుంబకలహాలతో భార్యను గొంతునులిమి చంపాడు. ఈ కేసులో నిందితుడికి కామారెడ్డి 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి రవీందర్ సింగ్ జీవితఖైదు, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. మరో కేసులో..కామారెడ్డి మండలం షబ్దీపూర్ గ్రామంలో 7 నెలల క్రితం గంగావత్ సూరి(40) అనే మహిళ ధరించిన ఆభరణాల కోసం కడమంచి రాములు(35) అనే వ్యక్తి హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడి కూడా జీవితఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment