తాజా వార్తలు

Thursday, 30 June 2016

250 మంది ఐసిస్‌ ఉగ్రవాదులను హతమార్చిన సంకీర్ణ దళాలు…

నిన్న మొన్నటి వరకూ ఊచకోతలతో భయాందోళనలు సృష్టించిన ఐసిస్‌ దళాలు, ఇప్పుడు ప్రాణ భయంతో పరుగులు తీస్తున్నాయి. పలాయనం చిత్తగిస్తున్న ఐసిస్‌ ఉగ్రవాదుల్ని వెంటాడి వేటాడి చంపుతున్నాయి సంకీర్ణ దళాలు. తాజాగా ఇరాక్‌లోని దక్షిణ ఫలూజాలో అమెరికా జరిపిన వైమానిక దాడిలో 250 మంది ఐసిస్‌ ఉగ్రవాదులు హతమయ్యారు.

దాదాపు 40 ట్రక్కుల్లో ఫలూజాను వీడి వెళ్తున్న ఐసిస్‌ దళాల కాన్వాయ్‌పై ఒక్క సారిగా విరుచుకున్నపడ్డాయి అమెరికా యుద్ధ విమానాలు. తప్పించుకునే అవకాశం లేని విధంగా బాంబులు కురిపించాయి. ఈ దాడితో పెద్ద సంఖ్యలో దళాలను కోల్పోవడంతో పాటు ఆయుధాలు, వాహనాలను నష్టపోయింది ఐసిస్‌. ఇప్పటికే ఎక్కడ తలదాచుకోవాలో అర్థంకాక నానా అవస్థలుపడుతున్న ఐసిస్‌కు తాజా ఘటనతో వెన్ను విరిచేసినట్టయ్యింది.
« PREV
NEXT »

No comments

Post a Comment