తాజా వార్తలు

Monday, 6 June 2016

‘మీ సేవ’కులకు 50 శాతం వేతన పెంపు

‘మీ సేవ’ కేంద్రాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు (ఆపరేటర్లు, మేనేజర్) 50 శాతం మేర వేతనాలను పెంచినట్లు సుపరిపాలన ప్రత్యేక కమిషనర్ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 110 అధీకృత కేంద్రాల్లోని ఉద్యోగులకు జూన్ 1 నుంచి వేతన పెంపు వర్తిస్తుం దని పేర్కొన్నారు. ఉద్యోగులకు ప్రతినెల మొదటి వారంలోనే వేతనాలు అందేలా చర్యలు చేపట్టామన్నారు.


అలాగే హైదరాబాద్‌లోని మీ సేవ కేంద్రాల్లో పని చేస్తున్న ఆపరేటర్లకు రోజుకు 125 లావాదేవీలు, జిల్లాల్లో పని చేస్తున్న ఆపరేటర్లకు రోజుకు 75 లావాదేవీలను లక్ష్యాలుగా నిర్దేశించామని తెలిపారు. ఉద్యోగుల ఉత్పాదకతపై మూడు నెలలకోసారి సమీక్ష జరపాలని నిర్ణయించామన్నారు. గత సర్వీస్ ప్రొవైడర్ కాంట్రాక్ట్ గడువు మే 31తో ముగిసినందున, కొత్తగా నెట్ ఎక్స్‌ఎల్ సంస్థను నియమించామని వెంకటేశ్వర్‌రావు పేర్కొన్నారు.  

 ఉద్యోగ భద్రతపై తొలగని ఆందోళన: మరోవైపు ఉద్యోగులకు వేతన పెంపు నిర్ణయం కొంత మేరకు సంతృప్తి ఇచ్చినప్పటికీ, ఉద్యోగ భద్రత విషయమై ఆందోళన మాత్రం తొలగలేదని మీ సేవ ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు జెన్నీఫర్ తెలిపారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా లేదా కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగులుగానైనా సర్కారు గుర్తించాలని డిమాండ్ చేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment