తాజా వార్తలు

Wednesday, 29 June 2016

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త. ఏడో వేతన సంఘం సిఫార్సులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. కనీస వేతనం 16 శాతం పెంచాలని ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సు చేసింది. పెరిగిన జీతాలు ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.
 
మోదీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ ఈ సిఫార్సులను ఆమోదించింది. ఏడవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం జీతం, పెన్షన్, అవెన్సుల్లో 23.55శాతం పెరుగుదలను యథాతథంగా అమలు చేస్తే ఉద్యోగుల ఫిట్‌మెంట్ 2.57 నుంచి 2.7కు పెరగనుంది. దీని ప్రకారం నూతన ఉద్యోగులకు కనీస వేతనం రూ. 18000 నుంచి రూ.23000గా ఉండనుంది.
« PREV
NEXT »

No comments

Post a Comment