తాజా వార్తలు

Saturday, 11 June 2016

జగన్ కు మరీ అంత పైశాచిక ఆనందమా?

తీవ్ర వ్యాఖ్యలు చేయటం ఏపీ మంత్రి అచ్చెన్నాయుడికి అలవాటే. రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర వ్యాఖ్యలు చేయటం.. ఈ సందర్భంగా తాను ఉపయోగించిన భాష విషయంలో పెద్దగా పట్టని నేతల్లో అచ్చెన్నాయుడు ముందుంటారు. విపక్ష నేత వైఎస్ జగన్ ను విమర్శించమంటే రెట్టించిన ఉత్సాహంతో వ్యాఖ్యలు చేసే ఆయన తాజాగా విపక్ష నేత మీద తీవ్ర వ్యాఖ్యలే చేశారు.

కులాల మధ్య చిచ్చు పెట్టి పైశాచిక ఆనందం పొందేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. జగన్ చెప్పినట్లే ముద్రగడ వ్యవహరిస్తున్నారంటూ తప్పు పట్టిన అచ్చెన్నాయుడు.. రెండు దఫాలుగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన దివంగత నేత వైఎస్ హయాంలో కాపుల గురించి ఏనాడూ నోరు విప్పలేదన్న విషయాన్ని గుర్తు చేసిన అచ్చెన్నాయుడు.. కాపుల్ని బీసీల్లో చేర్చేందుకు ప్రయత్నిస్తున్న తమపై మాత్రం విమర్శలు చేస్తున్నారన్నారు.

కాపుల్ని బీసీల్లో చేర్చే విషయం మీద మంజునాథన్ కమిటీ నివేదిక.. పల్స్ సర్వే అందాక ప్రభుత్వం స్పందిస్తుందన్న అచ్చెన్నాయుడు.. తాజాగా ముద్రగడ చేస్తున్న దీక్ష గురించిమాత్రం నోరు విప్పకపోవటం గమనార్హం. తుని ఘటనలో అరెస్ట్ చేసిన నిందితుల్ని విడుదల చేయాలన్న ముద్రగడ డిమాండ్ మీద మంత్రులు స్పందించకపోవటం ఏమిటి? నిందితుల్ని విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమిటన్న విషయాన్ని స్పష్టంగా చెప్పే విషయంలో ఏపీ మంత్రి ఎందుకు వెనకాడుతున్నట్లు..?
« PREV
NEXT »

No comments

Post a Comment