తాజా వార్తలు

Friday, 10 June 2016

రాజధానిలో వినియోగదారుల కమిషన్‌


రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ను రాష్ట్ర రాజధానికి సమీపంలోనే ఏర్పాటు చేసేందుకు అనుకూలమైన భవనాలు, వసతుల పరిశీలిస్తున్నామని అధ్యక్షుడు జస్టిస్‌ నౌషద్‌ ఆలి తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న వినియోగదారుల కమిషన్‌ను రాష్ర్టానికి తరలించే పనిలో భాగంగా అనుకూలమైన భవనాల పరీశీలన నిమిత్తం ఆయన శుక్రవారం గుంటూరు వచ్చారు. ఈ సందర్భంగా గుంటూరు బార్‌ అసోసియేషన్‌లో న్యాయవాదులతో సమావేశమయ్యారు.

 జస్టిస్‌ నౌషద్‌ ఆలి మాట్లాడుతూ పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణలు, చట్టాల్లో 90 శాతం ఎటువంటి చర్చా లేకుండానే ఆమోదం పొందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూ రు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గుత్తా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలో వసతులు ఉన్నాయని గతంలో హైకోర్టు కూడా గుంటూరులో పని చేసిందని, ఇక్కడే రాష్ట్ర కమిషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. 

రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు వి.బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర కమిషన్‌ ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించడానికి గుంటూరు న్యాయవాదులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తీగల దుర్గాప్రసాద్‌, న్యాయవాదులు నర్రా శ్రీనివాసరావు, కొల్లి శంకరరావు, లావు అంకమ్మచౌదరి, బుస్సా నాగేశ్వరరావు, దూళ్ల శ్రీనివాసరావు, వై.లక్ష్మిసరోజ ప్రసంగించారు. అనంతరం జస్టిస్‌ నౌషద్‌ ఆలి నగరంలోని పలు ప్రాంతాల్లోని భవనాలను పరిశీలించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment