తాజా వార్తలు

Saturday, 11 June 2016

పెళ్లి ‘అతగాడి’తోనే అంటోన్న సమంత

నిజం చెప్పకుండా ఉండలేదు. అలా అని పూర్తిగా చెప్పేందుకు ఇష్టపడని భామ సమంత. చెప్పి చెప్పనట్లుగా మాటలు చెప్పేసి.. ఆత్రుత పెంచేసి.. అందరూ తన గురించి మాట్లాడుకునేటట్లు చేసే ఈ చెన్నై చిన్నది.. రోజుకో రకంగా మాట్లాడటంలో ఎక్స్ పర్ట్. ఆ మద్యన ఎవరూ అడగకుండానే లవ్ మ్యాటర్ రివీల్ చేసి.. అందరిలో ఆత్రుత పెంచేసిన ఆమె.. తాను మనసు పడిన చిన్నోడి గురించి చెప్పేందుకు మాత్రం ససేమిరా అంటోంది.

అయితే.. అమ్మడు చెప్పకున్నా.. ఆమె ఇచ్చిన హింట్స్ తో సమంత మానసచోరుడు ఎవరన్న విషయం మీదన ఒక స్పష్టత వచ్చే వరకూ మీడియా నిద్ర పోకపోవటం తెలిసిందే. ఊరించే మాటలు చెబుతూ తన విషయాల మీద ఎగ్జైట్ మెంట్ పెంచే అమ్మడుకు లవ్ యవ్వారం ఏమిటన్న విషయం మీద ఒక క్లారిటీ వచ్చినా.. సమంత నోటి నుంచి మాత్రం కన్ఫర్మేషన్ రాలేదు. కాకుంటే.. ఆమె మాటలకు.. తమ ఊహాలకు ఆధారంగా ఈ మధ్యనే ఒక ఫోటో మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ వైరల్ కావటం తెలిసిందే.

తనకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటి రివీల్ కావటం ఒక ఎత్తు అయితే.. అమ్మడి పెళ్లి ముచ్చట్లు జోరుగా వచ్చేయటం సమంతకు అస్సలు నచ్చనట్లుంది. అందుకే కాబోలు.. తాజాగా ఆమె మాట్లాడుతూ.. పెళ్లి గురించి పూర్తి క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పుడే తాను పెళ్లి చేసుకోనని.. టైం వచ్చినప్పుడు తన మనసుకు నచ్చిన వాడి వివరాలు చెబుతానని.. అప్పటి వరకూ మీడియాను వెయిట్ చేయమంటోంది. మానస చోరుడినే పెళ్లి చేసుకుంటానంటూ ఊరించే మాటలు విన్న తర్వాత ఎవరు మాత్రం ఊరకే ఉండిపోతారు సమంతా..?
« PREV
NEXT »

No comments

Post a Comment