తాజా వార్తలు

Monday, 13 June 2016

కేరళలో బిజినెస్ స్టార్ట్ చేసిన ‘సింగం-3’…

వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న సూర్యకు ’24’ సినిమా చాలా ఊరటనిచ్చింది. కలెక్షన్ల పరంగానే కాకుండా, యాక్టింగ్ పరంగా కూడా ఈ సినిమా మనోడి రేంజ్ మరింత పెంచింది. దీంతో సూర్య తదుపరి ‘సింగం-3′ సినిమాకు భారీ బిజినెస్ జరుగుతోంది. ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా, కేరళలో మాత్రం ఈ సినిమా హక్కులను ఓ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రూ.3.5కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

’24’ సినిమా కేరళలో మంచి కలెక్షన్లు సాధించడం.., తెలుగు, తమిళ్ లో హిట్ అయిన ‘సింగం’ సీక్వెల్ గా తెరకెక్కుతుండడం.., అనుష్క, శృతీ హాసన్ లాంటి భారీ తారాగణం ఉండటంతో ఈ సినిమాకు ఈ బిజినెస్ జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి హారీష్ జైరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment